రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డాటా సెంటర్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

డాటా సెంటర్ల ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష

- రాయితీలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశం

- భూ కేటాయింపులో హేతుబద్ధత అవసరమని సూచన

- రైతులకు సంతృప్తికర పరిహారం ఇవ్వాలని స్పష్టం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్రంలో డాటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాలు అందిస్తున్న రాయితీలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డాటా సెంటర్లకు భూ కేటాయింపులో హేతుబద్ధత పాటించాలని సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో డాటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన సంస్థలు, వారికి అవసరమైన భూమి, మౌలిక వసతులపై చర్చించారు. వివిధ ప్రాంతాల్లో డాటా సెంటర్లు మరియు ఇతర మౌలిక వసతుల కల్పనకు సాగుతున్న భూ సేకరణ పురోగతిని అధికారులు వివరించారు. భూ పరిహారం నిర్ణయించే విషయంలో ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. రైతులను పిలిచి మాట్లాడి వారు సంతృప్తి చెందేలా పరిహారం నిర్ణయించాలన్నారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూమిపై పెట్టే పెట్టుబడి స్వల్పమని పేర్కొన్నారు. కంపెనీలకు సకాలంలో భూమి, ఇతర వసతులు అందుబాటులో ఉంచితే పనులు వేగంగా పూర్తి చేసుకుంటారని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సంస్థ కమిషనర్ శశాంకతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-