రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలోకి వచ్చింది

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలోకి వచ్చింది

- కేంద్ర ఉక్కు మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

- కేంద్ర–రాష్ట్ర సహకారంతో కర్మాగార పునరుజ్జీవనం

- కార్మికుల పట్టుదలతో ఉత్పాదకత పెరుగుదల

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఢిల్లీ, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖా మంత్రి హెచ్ డీ కుమారస్వామిను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుత స్థితిగతులు, భవిష్యత్ దిశపై సమగ్రంగా చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం, రాష్ట్ర ప్రభుత్వ మద్దతు, అలాగే కార్మికులు–ఉద్యోగుల అంకితభావం ఫలితంగా విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాట పట్టిందని ముఖ్యమంత్రి వివరించారు. కష్టకాలాన్ని అధిగమించి ఉత్పాదకత పెరగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం సాధించిందని పేర్కొన్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణకు అన్ని విధాలా సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కర్మాగార అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, భవిష్యత్ పెట్టుబడుల విషయంలో కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ భేటీలో స్పష్టం చేశారు.

Comments

-Advertisement-