రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మంగినపూడి బీచ్ అభివృద్ధికి శంకుస్థాపన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మంగినపూడి బీచ్ అభివృద్ధికి శంకుస్థాపన

- పర్యాటక కేంద్రంగా మంగినపూడిని తీర్చిదిద్దుతాం

- బీచ్‌కు వెళ్లే రోడ్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

మచిలీపట్నం, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మంగినపూడి బీచ్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్న హామీ మేరకు బీచ్‌కు వెళ్లే రోడ్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక ముఖచిత్రంపై మంగినపూడి బీచ్‌ను కీలక స్థానంలో నిలుపుతామని స్పష్టం చేశారు. బీచ్‌కు సౌకర్యవంతమైన రహదారి వసతులు కల్పించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంగినపూడి అభివృద్ధికి అవసరమైన అన్ని మౌలిక వసతుల పనులను వేగంగా పూర్తి చేసి చూపిస్తామని, పర్యాటక రంగం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. బీచ్ పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు రవాణా సౌకర్యాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో మచిలీపట్నం నియోజకవర్గంలో పర్యాటక రంగానికి కొత్త ఊపు రానుందని, మంగినపూడి బీచ్ రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు.

Comments

-Advertisement-