రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

శాసనమండలిలో వైసీపీ ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

శాసనమండలిలో వైసీపీ ఆందోళన

- నెయ్యి సరఫరా అంశంపై చర్చ డిమాండ్

- చర్చకు నిరాకరించిన ప్రభుత్వం

- పోడియం వద్ద నినాదాలు, సభ వాయిదా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):
శాసనమండలిలో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన అంశంపై సభలో చర్చించాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని అత్యవసర ప్రజా సమస్యగా పరిగణించాలని కోరింది. అయితే ప్రభుత్వం ఈ అంశంపై తక్షణ చర్చకు అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన వైసీపీ సభ్యులు మండలి ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. “హెరిటేజ్ ది కల్తీ నెయ్యి” అంటూ నినాదాలు చేశారు. సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో మండలి ఛైర్మన్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు. పరిస్థితిని శాంతింపజేయాలని సభ్యులకు సూచించారు. ఈ పరిణామంతో సభలో ఉదయం కార్యక్రమాలు అంతరాయం కలిగాయి.

Comments

-Advertisement-