రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

పలమనేరు నియోజకవర్గంలో మన్రేగా పరిరక్షణ యాత్ర

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

పలమనేరు నియోజకవర్గంలో మన్రేగా పరిరక్షణ యాత్ర

  • ఐదో రోజు చిత్తూరు జిల్లాలో యాత్ర కొనసాగింపు
  • గ్రామస్థుల రచ్చబండలో మన్రేగా కొనసాగాలన్న డిమాండ్
  • పేదల పొట్టగొట్టే చట్టం రద్దు చేయాలని పిలుపు
  • వైఎస్ హయాంలో పథకం జీవితాలను మార్చిందని గుర్తు

చిత్తూరు జిల్లా, ఫిబ్రవరి 6 (పీపుల్స్ మోటివేషన్):

మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర ఐదో రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో కొనసాగింది. వైఎస్ షర్మిల నాయకత్వంలో సాగుతున్న ఈ యాత్రలో భాగంగా గంగవరం మండలం నల్లగుట్లపల్లిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మన్రేగా పథకం కొనసాగాలని, పేదల జీవనాధారాన్ని దెబ్బతీసే వీబీజీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకం వల్ల గ్రామాల్లో ఉపాధి లభించిందని, వలసలు తగ్గాయని తెలిపారు. తమ కుటుంబాల జీవన స్థితిలో స్పష్టమైన మార్పు వచ్చిందని గ్రామస్తులు గుర్తు చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రచ్చబండలో పాల్గొన్న వారు 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభమైన ఉపాధి హామీ పథకం పేదలకు అండగా నిలిచిందని చెప్పారు. పలమనేరు నియోజకవర్గంలోని పల్లెల్లో ఈ పథకం వేలాది కుటుంబాలకు జీవనాధారంగా మారిందని గుర్తుచేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, మన్రేగా పథకం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందన్నారు. పేదల హక్కులను కాపాడేందుకు ఈ పరిరక్షణ యాత్ర కొనసాగుతుందని, ప్రజల స్వరం ప్రభుత్వానికి చేరే వరకు పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.

Comments

-Advertisement-