బీఆర్ఎస్ నేతలపై దాడులను తీవ్రంగా ఖండించిన కేటీఆర్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బీఆర్ఎస్ నేతలపై దాడులను తీవ్రంగా ఖండించిన కేటీఆర్
- కాంగ్రెస్ గుండాల దాడిపై ఆగ్రహం
- పార్టీ నేతలకు అండగా ఉంటామని భరోసా
- మేడ్చల్ జిల్లాలో నేతలపై దాడి ఘటనపై స్పందన
- జూబ్లీహిల్స్ కార్పొరేటర్‌పై దాడిని కూడా ఖండన
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (పీపుల్స్ మోటివేషన్):
బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ గుండాలు దాడులు చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కేటీఆర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన కేటీఆర్, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాజు శంభీపూర్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్లను బాధిత నేతల వద్దకు వెళ్లి పరామర్శించాలని సూచించారు. పార్టీ నేతలపై దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంగా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్ దేదీప్యపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఆయన అనుచరులు చేసిన దాడిని కూడా కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. దేదీప్యతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు ఇతర నగర బీఆర్ఎస్ నేతలు దేదీప్యను పరామర్శించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ శ్రేణులపై దాడులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments

