రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డయేరియా బాధితులను పరామర్శించిన ధర్మాన ప్రసాదరావు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

డయేరియా బాధితులను పరామర్శించిన ధర్మాన ప్రసాదరావు

  • కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
  • మరణాల లెక్కల్లో తారుమారు చేస్తున్నారని ఆరోపణ
  • జిల్లాల అభివృద్ధిని విస్మరించారంటూ మండిపాటు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

శ్రీకాకుళం, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
శ్రీకాకుళం జిల్లాలో ప్రబలిన డయేరియా బాధితులను మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. అనంతరం ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఇరవై నెలల పాలనలో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజలకు శాపంలా మారాయని మండిపడ్డారు. అతిసార వ్యాధితో జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వం మాత్రం ఒకరు లేదా ఇద్దరే మరణించారని అబద్ధపు లెక్కలు చెబుతోందని ఆరోపించారు. వాంతులు, విరోచనాలతో ప్రజలు అల్లాడుతుంటే సహాయం చేయాల్సింది పోయి పోస్టుమార్టం నివేదికల పేరుతో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. గతంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదన్నారు. ప్రతి జిల్లాకు అత్యాధునిక ఆసుపత్రులు అందించాలనే లక్ష్యాన్ని విస్మరించారని, రాజధాని పేరుతో నిధులన్నీ ఒకే ప్రాంతానికి మళ్లించారని ధ్వజమెత్తారు. రైతులకు ఎరువులు అందడం లేదని, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యానికి సరైన మద్దతు ధర లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారని అన్నారు.

శ్రీకాకుళం అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్లు అయినా ఖర్చు చేశారా అని ప్రశ్నించిన ఆయన, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని హెచ్చరించారు. త్వరలోనే ప్రజలు తగిన తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

Comments

-Advertisement-