రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జల జీవన్ పథకాన్ని పునఃప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జల జీవన్ పథకాన్ని పునఃప్రారంభిస్తున్న ఏపీ ప్రభుత్వం

  • అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన
  • ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు లక్ష్యం
  • గ్రామీణ ప్రాంతాలకు కుళాయి కనెక్షన్లు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జల జీవన్ పథకాన్ని మళ్లీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీరు అందించడమే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. జల జీవన్ పథకం అమలుపై శాసనమండలిలో పలువురు సభ్యులు ప్రశ్నలు లేవనెత్తగా, ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యను పూర్తిగా నివారించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. జల జీవన్ పథకం 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రతి కుటుంబానికి రోజుకు 55 లీటర్ల నీరు అందించే విధంగా ప్రణాళిక రూపొందించారు. మహిళలు నీటి కోసం క్యూల్లో నిలబడాల్సిన అవసరం లేకుండా చేయడమే ఈ పథకం ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ పథకానికి కేంద్రం, రాష్ట్రం తలా యాభై శాతం నిధులు సమకూరుస్తున్నాయి. 2028 వరకు ఈ పథకాన్ని కొనసాగించనున్నట్లు సమాచారం. గ్రామాల్లో ఇంటింటికి నీటి కనెక్షన్లు కల్పించి తాగునీటి సమస్యను పూర్తిగా తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

Comments

-Advertisement-