రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డయేరియా ప్రబలికపై కమిషనర్ సస్పెన్షన్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

డయేరియా ప్రబలికపై కమిషనర్ సస్పెన్షన్

  • విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఆరోపణ
  • శ్రీకాకుళంలో ఒకరు మృతి, 76 మంది ఆసుపత్రిలో చికిత్స
  • ఇంటింటా సర్వేలు, వైద్య శిబిరాల ఏర్పాటు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
శ్రీకాకుళం పట్టణంలో డయేరియా వ్యాప్తికి సంబంధించి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాకివీధి, గోల్కొండ రేవు, దమ్మలవీధి, మంగువారితోట ప్రాంతాల్లో డయేరియా ప్రబలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో నిర్లక్ష్యం జరిగిందనే ప్రాథమిక నివేదికల ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి తక్షణ చికిత్స అందిస్తున్నారు. తాగునీటి వనరులను పరిశీలిస్తూ శుద్ధి చర్యలు చేపడుతున్నారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజారోగ్య విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావివ్వబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు.

Comments

-Advertisement-