మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు… అసెంబ్లీలో ప్రకటన చేస్తాం: సీఎం రేవంత్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు… అసెంబ్లీలో ప్రకటన చేస్తాం: సీఎం రేవంత్
- సచివాలయంలో మాజీ అగ్రనేతల భేటీ
- జనజీవన స్రవంతిలోకి రావాలని సీఎం సూచన
- తుపాకీ సిద్ధాంతం నడవదన్న దేవ్‌జీ వ్యాఖ్య
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (పీపుల్స్ మోటివేషన్): మావోయిస్టు కీలక నేతల లొంగుబాటుపై అసెంబ్లీలో ప్రకటన చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వెల్లడించారు. మావోయిస్టు మాజీ అగ్రనేతలు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్, చంద్రన్నలు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపారు. భేటీ అనంతరం సీఎం మాట్లాడుతూ జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత చట్టపరిధిలో ఏ పని చేసినా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అయితే చట్టాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం తన విధిని నిర్వర్తిస్తుందని స్పష్టం చేశారు. శాంతి, అభివృద్ధి మార్గమే రాష్ట్రానికి అవసరమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మాజీ మావోయిస్టు దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రివార్డు పాలసీని కోటి రూపాయలకు పెంచాలని కోరినట్లు తెలిపారు. తమకు ఐదెకరాల భూమి ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ, అది సాధ్యం కాదని సీఎం చెప్పారని వెల్లడించారు. అయితే ఇల్లు, ఉద్యోగం, జీవనభృతిపై హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతితో జైళ్లలో ఉన్న మావోయిస్టులను కలిసి, లొంగుబాట్లపై ప్రజలకు బహిరంగ లేఖ రాయాలని నిర్ణయించుకున్నట్లు దేవ్‌జీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదని ప్రజలకు వివరించేందుకు సిద్ధమని అన్నారు. రాష్ట్రంలో శాంతి స్థాపనకు ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Comments
