రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఫేక్ ఈ-మెయిల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఫేక్ ఈ-మెయిల్స్‌పై అప్రమత్తంగా ఉండాలి 

- తెలంగాణ పోలీసుల హెచ్చరిక

- అచ్చం ఒరిజినల్‌లా కనిపించే మోసపూరిత మెయిల్స్

- వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం లక్ష్యం

- అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని సూచన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
ఫేక్ ఈ-మెయిల్స్ ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అచ్చం అసలు సంస్థల నుంచి వచ్చినట్టుగా కనిపించే ఈ మెయిల్స్‌లో దాగి ఉన్న మోసపూరిత లింకులపై క్లిక్ చేస్తే వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు దొంగిలించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. చిన్నచిన్న అక్షరాల తేడాతో ఒరిజినల్ సంస్థల పేర్లను ఉపయోగిస్తూ బురిడీ కొట్టిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా కస్టమర్ సేవలు, బ్యాంక్ ఖాతా ధృవీకరణ, బహుమతి గెలిచారు వంటి పేర్లతో మెయిల్స్ పంపించి ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మెయిల్స్‌లో ఉన్న లింకులపై క్లిక్ చేయకుండా, అటాచ్‌మెంట్లు డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అనుమానాస్పద మెయిల్ వచ్చినప్పుడు వెంటనే తొలగించడంతో పాటు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. వ్యక్తిగత సమాచారం, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల నుంచి రక్షణకు అప్రమత్తతే ప్రధాన ఆయుధమని తెలంగాణ పోలీసులు తెలిపారు.

Comments

-Advertisement-