రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో ఈటెల రాజేందర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో ఈటెల రాజేందర్

- మునీరాబాద్‌లో శివాజీ విగ్రహానికి ఘన నివాళి

- బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కార్యక్రమం

- యువతకు శివాజీ స్ఫూర్తిని అందించాలని పిలుపు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మేడ్చల్ మల్కాజిగిరి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్):
హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మునీరాబాద్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు పి విక్రమ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, కృష్ణ గౌడ్, అధ్యక్షుడు కావేరి శ్రీధర్ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలు, దేశభక్తి, పరిపాలనా దక్షత యువతకు ఆదర్శమని ఎంపీ పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజ సేవలో ముందుండాలని యువతకు పిలుపునిచ్చారు.

Comments

-Advertisement-