రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నందిగామ సమీపంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నందిగామ సమీపంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం

  • కేసర టోల్‌గేట్ వద్ద మంటలు
  • డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితం
  • వరుస బస్సు ఘటనలతో ప్రజల్లో భయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

నందిగామ, ఫిబ్రవరి 7, 2026 (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బస్సు కంచికచర్ల మండలం పరిధిలోని కేసర టోల్‌గేట్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక భాగంలోని ఇంజిన్ నుంచి పొగలు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పొగలు గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేసి ప్రయాణికులను దిగిపోవాలని సూచించడంతో పెను ప్రమాదం తప్పింది. కొద్ది సేపటిలోనే బస్సు పూర్తిగా మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రయాణ సమయంలో బస్సులో మొత్తం ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందరూ సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బస్సు ప్రయాణం అంటేనే భయపడే పరిస్థితి నెలకొందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

-Advertisement-