రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అసెంబ్లీకి వచ్చిన విద్యార్థులతో మంత్రి ముచ్చట

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అసెంబ్లీకి వచ్చిన విద్యార్థులతో మంత్రి ముచ్చట

- మాతృభాషను మర్చిపోవద్దని సూచన

- సభా కార్యాచరణపై విద్యార్థుల ఆనందం

- మధ్యాహ్న భోజన పథకంపై ఆరా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అమరావతి, ఫిబ్రవరి 25 (పీపుల్స్ మోటివేషన్):
అసెంబ్లీ కార్యాకలాపాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. స్పీకర్ చొరవతో సభా గ్యాలరీకి వచ్చిన విద్యార్థులను మంత్రి ఆప్యాయంగా పలకరించారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్షంగా చూడటం ఎలా అనిపించిందని మంత్రి ప్రశ్నించగా, సభా చర్చలను దగ్గరగా చూడటం చాలా సంతోషంగా ఉందని, ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా చూడటం ఒక ప్రత్యేక అనుభవమని వారు పేర్కొన్నారు. తాను విదేశాల్లో చదివిన కారణంగా తొలుత తెలుగు మాట్లాడటంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని మంత్రి గుర్తుచేశారు. ఇంగ్లీషు విద్యను అభ్యసించడంలో ముందుండాలని, అయితే మాతృభాష తెలుగును ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు. మాతృభాషపై పట్టు పెంచుకోవడం వ్యక్తిత్వ వికాసానికి ఎంతో అవసరమని తెలిపారు. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ఎలా ఉందని విద్యార్థులను మంత్రి ఆరా తీశారు. పాఠశాలల్లో అందుతున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసుకుని, అవసరమైతే మరింత మెరుగుపరిచే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

-Advertisement-