రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హెరిటేజ్–ఇందాపూర్ వివాదం ముదురుతోంది

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హెరిటేజ్–ఇందాపూర్ వివాదం ముదురుతోంది

- హెరిటేజ్‌కు టీటీడీతో సంబంధం లేదన్న చైర్మన్

- ఇందాపూర్ అంశంపై చర్చకు రావాలన్న విపక్షం

- బొత్సకు లీగల్ నోటీసులు, మండలిలో ఉద్రిక్తత

తిరుపతి/అమరావతి, 19 ఫిబ్రవరి (పీపుల్స్ మోటివేషన్): కల్తీ నెయ్యి కేసులో వైఎస్సార్సీపీ పీకల్లోతు కూరుకుపోయిందని, హెరిటేజ్ కంపెనీపై చేస్తున్న ఆరోపణలు దురుద్దేశపూర్వకమని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అన్నారు. టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తోందన్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ, హెరిటేజ్ సంస్థకు టీటీడీతో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఓపెన్ టెండర్ల ద్వారా నెయ్యి కొనుగోలు జరుగుతుందని, అన్నప్రసాదాల నాణ్యత విషయంలో రాజీ లేదని వెల్లడించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఇదిలా ఉండగా, ఇందాపూర్ డెయిరీతో హెరిటేజ్‌కు సంబంధాలున్నాయని తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వం చర్చకు రావడం లేదని, నిజాలు బయటపడతాయనే భయంతో తప్పించుకుంటోందని ఆరోపించారు. తిరుమల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదన్నారు. మరోవైపు హెరిటేజ్ సంస్థ బొత్స సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అసత్య ఆరోపణలతో సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీశారని ఆరోపిస్తూ, తక్షణమే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని కోరింది. లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తూ ప్రీమియం బ్రాండ్‌గా గుర్తింపు పొందిన సంస్థపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. ఈ వివాదం శాసనమండలిలో ఉద్రిక్తతకు దారితీసింది. ఇందాపూర్–హెరిటేజ్ అంశంపై చర్చించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి ఛైర్మన్ తిరస్కరించడంతో సభలో నినాదాలు వెల్లువెత్తాయి. కొందరు సభ్యులు పోడియం వద్ద విజిల్స్ వేసి హంగామా సృష్టించడంతో సభను వాయిదా వేశారు. పెద్దల సభ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారంటూ అధికార పార్టీ సభ్యులు మండిపడగా, విపక్షం మాత్రం చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబడుతోంది.

Comments

-Advertisement-