మహా శివరాత్రి సందర్భంగా సీఎం శుభాకాంక్షలు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మహా శివరాత్రి సందర్భంగా సీఎం శుభాకాంక్షలు
- - రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి శుభాభినందనలు
- - సుభిక్ష తెలంగాణ కోసం మహాదేవునికి ప్రార్థనలు
- - భక్తులకు ఆయురారోగ్యాలకై ఆకాంక్ష
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్): మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని మహాదేవునిని ప్రార్థించారు.
మహా శివరాత్రి ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులందరికీ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని సీఎం ఆకాంక్షించారు. భక్తి, విశ్వాసాలతో నిర్వహించే ఈ పర్వదినం సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న అధికారులకు, సేవలందిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. శాంతి, సామరస్యాలతో పండుగను జరుపుకోవాలని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు.
Comments
