రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సమవేషి అజీవిక యోజన అమలుపై వీడియో సమావేశం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సమవేషి అజీవిక యోజన అమలుపై వీడియో సమావేశం

- సెర్ప్ సీఈఓ దివ్య ఆధ్వర్యంలో సమీక్ష

- కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు పాల్గొనడం

- పథకం అమలుకు కార్యాచరణపై చర్చ

అదిలాబాద్, ఫిబ్రవరి 7 (పీపుల్స్ మోటివేషన్): ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టనున్న సమవేషి అజీవిక యోజన పథకం అమలుపై శనివారం హైదరాబాద్ నుంచి సెర్ప్ సీఈఓ డి. దివ్య ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా సమవేషి అజీవిక యోజన లక్ష్యాలు, లబ్ధిదారుల ఎంపిక, పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల పెంపు, ఆర్థిక స్వావలంబన దిశగా ఈ పథకం కీలకంగా నిలవనున్నదని అధికారులు పేర్కొన్నారు.

జిల్లా స్థాయిలో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించడంతో పాటు, సంబంధిత శాఖల సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షణ పటిష్టం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.

Comments

-Advertisement-