రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లంచం డిమాండ్ వ్యవహారం.. కానిస్టేబుల్ సస్పెన్షన్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

లంచం డిమాండ్ వ్యవహారం.. కానిస్టేబుల్ సస్పెన్షన్

  • నిందితుల పేర్లు చేర్చకూడదని డబ్బుల డిమాండ్ ఆరోపణ
  • ఎస్‌ఐపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు
  • ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీసు స్టేషన్‌లో కలకలం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విజయవాడ, ఫిబ్రవరి 20 (పీపుల్స్ మోటివేషన్):
ఓ కేసులో నిందితులుగా పేర్లు చేర్చకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్ చేసిన వ్యవహారంలో ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి పోలీసు స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కొండలరావును సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత ఎస్‌ఐ ఉమామహేశ్వరరావుపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. గోపినేనిపాలెంలో నమోదైన ఒక కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు స్టేషన్ బెయిల్‌పై పంపించారు. అయితే అదే కేసులో నిందితుడి సోదరుడు, అతని స్నేహితులను తరచుగా స్టేషన్‌కు పిలిపిస్తూ వేధిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కేసులో పేర్లు చేర్చకుండా ఉండేందుకు 50 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితులు అవినీతి నిరోధక శాఖకు సమాచారం అందించారు. లంచం స్వీకరిస్తుండగా పట్టుకునేందుకు అధికారులు పథకం రచించారు. నిందితుడి తండ్రి డబ్బులు ఇవ్వడానికి వెళ్లగా, ఆ సమయంలో స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బయట ఉన్న అవినీతి నిరోధక శాఖ సిబ్బందిని గుర్తించి అనుమానం వ్యక్తం చేసినట్లు సమాచారం. వెంటనే ఎస్‌ఐకి సమాచారం ఇవ్వడంతో ఆయన స్టేషన్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై సీపీ రాజశేఖరబాబు విచారణకు ఆదేశించారు. గ్రామీణ డీసీపీ లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో విచారణ జరిపి ప్రాథమికంగా కానిస్టేబుల్ పాత్ర నిర్ధారించారు.

డీసీపీ సిఫార్సు మేరకు కానిస్టేబుల్ కొండలరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. స్టేషన్ సీసీ దృశ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో చిత్తూరు జిల్లాలో పనిచేసిన ఎస్‌ఐ సీవీ నరసింహులు అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన ఘటనను అధికారులు గుర్తు చేశారు. అధికార దుర్వినియోగం, లంచం ఆరోపణలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

Comments

-Advertisement-