రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కొలువుదీరిన పురపాలక పాలకులు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కొలువుదీరిన పురపాలక పాలకులు

- నూతన మేయర్, చైర్మన్లకు మంత్రి పొంగులేటి శుభాకాంక్షలు

- పట్టణాల అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని సూచన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఖమ్మం, ఫిబ్రవరి 16 (పీపుల్స్ మోటివేషన్):
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలకు నూతనంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన మేయర్‌లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్‌లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఈ నూతన సారథులు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పట్టణాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన సిరిపురపు లలితకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే మధిర మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోట ధనమూర్తి, సత్తుపల్లి చైర్మన్ రెహానా బేగం, వైస్ చైర్మన్ బొంతు సుమలత, వైరా చైర్మన్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, అశ్వారావుపేట చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్, ఏదులాపురం చైర్మన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, కల్లూరు చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, వైస్ చైర్మన్ శీలం కోటేశ్వరి తదితరులను అభినందించారు. పట్టణాల అభివృద్ధిలో ప్రతి వార్డు, ప్రతి డివిజన్ పురోగమించాలంటే కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కీలక పాత్ర పోషించాలని మంత్రి పేర్కొన్నారు. మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, ప్రజా సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందుబాటులో ఉండి పారదర్శకంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త పాలకవర్గాలు సమన్వయంతో పనిచేస్తే పట్టణాల రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Comments

-Advertisement-