రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గౌతు శ్యాం సుందర శివాజీకి ఘన స్వాగతం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

టీడీపీ కేంద్ర కార్యాలయంలో గౌతు శ్యాం సుందర శివాజీకి ఘన స్వాగతం

- మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆహ్వానంతో భేటీ

- సీనియర్ నేతల అనుభవానికి గౌరవం తెలిపిన లోకేష్

- పార్టీ బలోపేతంపై సలహాలు, సూచనలు

అమరావతి, ఫిబ్రవరి 06 (పీపుల్స్ మోటివేషన్):

పెద్దలను, సీనియర్ నాయకులను గౌరవించే సంప్రదాయానికి నిదర్శనంగా, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఆహ్వానం మేరకు శుక్రవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి గౌతు శ్యాం సుందర శివాజీకి ఘన స్వాగతం పలికారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కేంద్ర కార్యాలయానికి వచ్చిన శివాజీ గారిని స్వయంగా ఎదురేగి ఆహ్వానించిన నారా లోకేష్, ఆయనతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా అలనాటి రాజకీయ పరిణామాలు, పార్టీ అనుభవాలు, వ్యక్తిగత జ్ఞాపకాలను శివాజీ గారు గుర్తు చేస్తూ మాట్లాడుతుంటే లోకేష్ ఆసక్తిగా విన్నారు. రాజకీయ పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై గౌతు శ్యాం సుందర శివాజీ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సీనియర్ నేతల అనుభవం పార్టీకి ఎంతో అవసరమని లోకేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ భేటీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Comments

-Advertisement-