రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మాదాపూర్‌లో లంచం కేసు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మాదాపూర్‌లో లంచం కేసు

- సబ్ ఇన్‌స్పెక్టర్ గండ్ర వినయ్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (పీపుల్స్ మోటివేషన్):

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ గండ్ర వినయ్ లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కేసు నంబర్ 2202/2025లో జారీ చేసిన నోటీసుల ప్రతులు ఇవ్వడం, భవిష్యత్తులో అరెస్ట్ చేయకుండా చూడటం పేరుతో ఫిర్యాదుదారుడి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరించిన సమయంలో అధికారులు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ ఘటనపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే ప్రజలు భయపడకుండా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని అవినీతి నిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది. లంచం డిమాండ్ చేసిన ఏ ప్రభుత్వ సేవకుడిపై అయినా చర్యలు తీసుకునేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని, అలాగే వాట్సాప్ నంబర్ 9440446106, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారులు, బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-