Health Tips:తల స్నానం – శుభ్రతతో పాటు జుట్టు ఆరోగ్యానికి అవసరం
Health news
Health tips
Health updates in Telugu
Health newsIndia
Good health news
HealthNews
Daily health tips
health tips in Telugu
Health care news
By
Mounikadesk
Health Tips :తల స్నానం – శుభ్రతతో పాటు జుట్టు ఆరోగ్యానికి అవసరం
ఫిబ్రవరి 14 (పీపుల్స్ మోటివేషన్):
తల శుభ్రత ఎందుకు ముఖ్యము?
తల స్నానం కేవలం శుభ్రత కోసం మాత్రమే కాదు, తల చర్మం మరియు జుట్టు ఆరో్యానికి కూడా అవసరమని చర్మ వైద్యులు చెబుతున్నారు. రోజూ బయటకు వెళ్లే వారు ధూళి, కాలుష్యం కారణంగా తలపై మురికి పేరుకుపోతుందని పేర్కొంటున్నారు. సరైన సమయంలో తల స్నానం చేయకపోతే శుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంత తరచుగా తల స్నానం చేయాలి? తల చర్మం స్వభావాన్ని బట్టి వారానికి రెండు నుంచి మూడు సార్లు తల స్నానం చేయడం సరిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువగా చెమట పడే వారు లేదా ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు అవసరాన్ని బట్టి మరికొన్ని సార్లు స్నానం చేయవచ్చని చెబుతున్నారు. అయితే ప్రతిరోజూ కఠిన రసాయనాలున్న షాంపూలను వాడటం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
- తల స్నానం ముందు, తర్వాత జాగ్రత్తలు
తల స్నానం చేసే ముందు కొద్దిగా నూనెతో మసాజ్ చేయడం తల చర్మానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని, చాలా వేడి నీరు వాడితే జుట్టు పొడిబారే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. తడి జుట్టును బలంగా తుడవకూడదని, సహజంగా ఆరనివ్వడం మంచిదని సూచిస్తున్నారు. సరైన అలవాట్లతో ఆరోగ్యకరమైన జుట్టు సరైన షాంపూ ఎంపిక, పోషకాహారం, ఒత్తిడి నియంత్రణ ఇవి జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకమని వైద్యులు చెబుతున్నారు. తల స్నానం సమయానికి చేయడం ద్వారా శుభ్రతతో పాటు జుట్టు బలంగా, మెరిసేలా ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. క్రమబద్ధమైన సంరక్షణతో తల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Comments

