పోలవరం నిర్వాసితులకు రూ.226 కోట్ల పరిహారం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
పోలవరం నిర్వాసితులకు రూ.226 కోట్ల పరిహారం
- ముంపు గ్రామాల ప్రజలతో సీఎం సమావేశం
- పునరావాస ప్యాకేజీ మూడో విడత చెక్కుల పంపిణీ
- డయాఫ్రం గోడ పునర్నిర్మాణానికి కొత్త చర్యలు
పోలవరం, మార్చి 18 (పీపుల్స్ మోటివేషన్): పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితులను గుండెల్లో పెట్టుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులతో ఆయన సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. పునరావాస పరిహార ప్యాకేజీ మూడో విడతలో భాగంగా నిర్వాసితులకు రూ.226 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా తమ భూములు, ఇళ్లను కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. వారికి న్యాయం జరిగేలా పునరావాస చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టులో అత్యంత ముఖ్యమైన డయాఫ్రం గోడ దెబ్బతిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నిపుణులతో అధ్యయనం చేయించి ఇప్పుడు సుమారు వెయ్యి కోట్ల రూపాయల వ్యయంతో కొత్త డయాఫ్రం గోడను నిర్మిస్తున్నామని చెప్పారు. గతంలో నిర్వాసితుల సమస్యలను పట్టించుకోలేదని, వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులు పడినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు మరియు నిర్వాసితుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం నియోజకవర్గాన్ని పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిబద్ధతతో నిర్మాణ పనులను పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
