మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం
- టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్
- మరో నిందితురాలు ప్రియాంక రెడ్డికీ బెయిల్ మంజూరు
- డ్రగ్స్ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్
హైదరాబాద్, మార్చి 16 (పీపుల్స్ మోటివేషన్): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో పట్టుబడిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. సోమవారం పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో ఆయనకు నోటీసులు ఇచ్చి విడుదల చేసినట్లు సమాచారం. పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ప్రియాంక రెడ్డికీ స్టేషన్ బెయిల్ లభించినట్లు తెలిసింది. విచారణకు అవసరమైన సమయంలో హాజరు కావాలని నోటీసులు జారీ చేసి వారిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇంకా పలువురిని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ఈ కేసు దర్యాప్తును ఈగల్ బృందం వేగవంతం చేసింది. మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. ఈ పార్టీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాటిని ఎవరు సరఫరా చేశారు, ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక నిందితులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కూడా కీలక విషయాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.
Comments
