రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మరణించిన హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సహాయం

- శ్రీకాకుళం జిల్లా పోలీసుల సాయంతో రూ.4.08 లక్షలు

- నగదు చెక్కును అందజేసిన అదనపు ఎస్పీ కె.వి. రమణ

- హోంగార్డుల ఐక్యతకు నిదర్శనమని ప్రశంస

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

శ్రీకాకుళం, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
శ్రీకాకుళం జిల్లా హోంగార్డు యూనిట్‌కు చెందిన హోంగార్డు పాలవలస భాస్కరరావు విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఇటీవల ఫిబ్రవరిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి జిల్లా పోలీసు శాఖ ఆర్థిక సహాయం అందించింది. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో భాస్కరరావు సతీమణి పి. రాజేశ్వరికి అదనపు ఎస్పీ కె.వి. రమణ రూ.4 లక్షల 8 వేల నగదు చెక్కును అందజేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు అందరూ స్వచ్ఛందంగా తమ ఒక రోజు దినసరి గౌరవ వేతనాన్ని అందించి ఈ సహాయాన్ని సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందిన లేదా పదవీ విరమణ పొందిన హోంగార్డుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు హోంగార్డులు తమ వేతనాన్ని విరాళంగా అందిస్తున్నారని అదనపు ఎస్పీ తెలిపారు. సహచర ఉద్యోగి కుటుంబానికి తోడుగా నిలుస్తూ హోంగార్డులు ఐక్యతను చాటుతున్నారని ఆయన కొనియాడారు. అందించిన నగదును కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోవాలని అదనపు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సిహెచ్ గోపినాథ్, ఆర్‌ఐ వెంకటరమణ, ఆర్‌ఎస్సై హరనాథ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Comments

-Advertisement-