రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మన్రేగా పరిరక్షణ యాత్రకు ప్రజల మద్దతు: వైఎస్ షర్మిల

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మన్రేగా పరిరక్షణ యాత్రకు ప్రజల మద్దతు: వైఎస్ షర్మిల

- ఏలూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం

- ఉపాధి హామీ పథకం లబ్ధి వివరించిన షర్మిల

- ప్రభుత్వ వైఫల్యాలపై స్థానికుల ఆవేదన

ఏలూరు, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్రకు ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందని కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఎర్రంపల్లి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె ప్రజలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు లభించే ప్రయోజనాలను షర్మిల వివరించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన G–RAMG చట్టం వల్ల గ్రామీణ కార్మికులకు కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేశారు. ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రజల మద్దతు కోరారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించారు. అర్హులైన వారికి కొత్తగా పెన్షన్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహాశక్తి పథకం కింద నెలకు రూ.1500 ఎప్పుడు ఇస్తారని మహిళలు ప్రశ్నించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని షర్మిల పేర్కొన్నారు.

Comments

-Advertisement-