బైక్ పొగతో నలుగురు మృతి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బైక్ పొగతో నలుగురు మృతి
- ఇంట్లోనే బైక్ ఆన్ చేయడంతో విషాదం
- తాత, మనవడు, ఇద్దరు మనవరాళ్లు మృతి
- అన్నమయ్య జిల్లాలో దుర్ఘటన
అన్నమయ్య, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్): అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో బైక్‌ను ఆన్ చేసి ఉంచడంతో వచ్చిన విషపూరిత పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. ఈ ఘటన పుంగనూరు పట్టణంలోని త్యాగరాజవీధిలో చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సమాచారం ప్రకారం బోరుకొచ్చిన బైకును ఇటీవల రిపేర్ చేయించుకున్నారు. మరమ్మతుల అనంతరం బైక్ సరిగ్గా పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి కొంతసేపు ఆన్‌లో ఉంచాలని మెకానిక్ సూచించినట్లు తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు బైకును ఇంటి లోపలే ఆన్ చేసి ఉంచి రాత్రంతా అలాగే వదిలేశారు. బైక్ నుంచి వెలువడిన కార్బన్ మోనాక్సైడ్ అనే విషపూరిత వాయువు గదిలో నిండిపోవడంతో అదే గదిలో నిద్రిస్తున్న తాత, ఒక మనవడు, ఇద్దరు మనవరాళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఉదయం వరకు ఎవరూ గమనించకపోవడంతో వారు ఊపిరాడక మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో పిల్లల తల్లిదండ్రులు ఇంటి పైకప్పుపై నిద్రించడం వల్ల వారికి ప్రమాదం తప్పింది. ఉదయం కుటుంబ సభ్యులు కిందికి వచ్చి చూసే సరికి నలుగురు అపస్మారక స్థితిలో ఉండటంతో విషయం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Comments
