బీజేపీ రాష్ట్ర కార్యశాల నిర్వహణ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బీజేపీ రాష్ట్ర కార్యశాల నిర్వహణ
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై చర్చలు
పార్టీ బలోపేతంపై నేతల సూచనలు
అమరావతి, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్): భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై రాష్ట్ర స్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం, కార్యకర్తల సమన్వయం వంటి అంశాలపై నాయకులు చర్చలు జరిపారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించేందుకు వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే శ్రీకాంత్ శర్మ హాజరయ్యారు. పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం, కార్యకర్తల పాత్రను పెంచడం వంటి అంశాలపై ఆయన కీలక సూచనలు చేశారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని, సంస్థాగతంగా బలపడితేనే పార్టీ మరింత ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కన్వీనర్ నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. పార్టీ కార్యకలాపాలను సమర్థవంతంగా అమలు చేయడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే సంస్థ మరింత బలపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, శాసన మండలి బీజేపీ పక్ష నేత సోము వీర్రాజు, శాసనసభ బీజేపీ పక్ష నేత పెన్మత్స విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ పోతుల సునీత, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్, రాష్ట్ర సమన్వయకర్తలు జల్లి మధుసూదన్, శరణాల మాలతీ రాణి, మేకల హనుమంతు రావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Comments
