రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వెలుగుమట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వెలుగుమట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్

  • గూడు కోల్పోయిన భూదాన్ నిరుపేదలకు సహాయం
  • న్యాయపోరాటానికి మద్దతు
  • పువ్వాడ ఫౌండేషన్ ద్వారా భోజన వసతి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఖమ్మం, మార్చి 3 (పీపుల్స్ మోటివేషన్):
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో గూడు కోల్పోయిన భూదాన్ నిరుపేదలకు భారత రాష్ట్ర సమితి అండగా నిలిచింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు జిల్లా నాయకత్వం బాధితులకు న్యాయపోరాటంలో సహకారం అందిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ, గూడు చెరిగిన కుటుంబాలకు తక్షణ సహాయంగా ఆహారం, తాగునీటి వసతులు కల్పిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు తమ అండ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలోని పువ్వాడ ఫౌండేషన్ ద్వారా బాధితులకు భోజనం, నీళ్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో సహాయం అందించడంపై బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

గూడు కోల్పోయిన పేదల సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పార్టీ అండగా ఉంటుందని బీఆర్ఎస్ నాయకత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

Comments

-Advertisement-