రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గ్యాస్ కొరత భయం.. రాష్ట్రంలో ప్రజల ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గ్యాస్ కొరత భయం.. రాష్ట్రంలో ప్రజల ఆందోళన

- ఏజెన్సీల వద్ద బారులు తీరుతున్న వినియోగదారులు

- వాణిజ్య సిలిండర్ల కొరతతో హోటళ్లపై ప్రభావం

- పెట్రోల్ బంకుల వద్ద కూడా క్యూలు.. వదంతులతో గందరగోళం

అమరావతి, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): పశ్చిమాసియా దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై కనిపిస్తోంది. గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు ఏజెన్సీల వద్ద బారులు తీరుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గడంతో పట్టణాల్లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ దుకాణాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. కొన్నిచోట్ల వంటశాలలు మూతపడగా, మరికొన్ని చోట్ల కట్టెలతో వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరిస్తోంది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

గ్యాస్ కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నా, ప్రజల్లో మాత్రం భయం నెలకొంది. ముందస్తు బుకింగ్‌లు పెరగడంతో ఏజెన్సీలపై ఒత్తిడి అధికమైంది. ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థ కూడా కొన్ని చోట్ల సరిగా పనిచేయకపోవడంతో ప్రజలు నేరుగా ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సి వస్తోంది.

కోనసీమ జిల్లా ముమ్మిడివరం వంటి ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు నిరసనలు చేపట్టారు. సకాలంలో సిలిండర్లు అందకపోవడంతో టెంట్లు వేసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సింగిల్ సిలిండర్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న వదంతులతో బంకుల వద్ద కూడా భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పలు బంకులు మూతపడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్నిచోట్ల గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది.

అయితే అధికారికంగా ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. సరఫరా వ్యవస్థను సక్రమంగా నిర్వహించి వదంతులను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Comments

-Advertisement-