రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తిరుపతిలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తిరుపతిలో నకిలీ మద్యం తయారీ గుట్టురట్టు

- శేషాద్రి నగర్‌లో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

- గంజాయి సేవిస్తున్న వ్యక్తితో పాటు నకిలీ మద్యం స్వాధీనం

- తిరుచానూరు పోలీసుల మెరుపు దాడుల్లో పలువురు పట్టుబాటు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తిరుపతి, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
తిరుపతిలో నకిలీ మద్యం తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. తిరుపతి నగరంలోని శేషాద్రి నగర్ ప్రాంతంలో నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ దాడుల్లో గంజాయి సేవిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు నకిలీ మద్యం సీసాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు పాడిపేట ప్రాంతంలోని ఇందిరమ్మ గృహాలలో నకిలీ మద్యం తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు. తిరుచానూరు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. ఈ దాడులను తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదుగురు సిఐలు, పది మంది ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది ఏకకాలంలో దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారీపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

-Advertisement-