రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు చేస్తాం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు చేస్తాం

- సిఎంఆర్ బకాయిలపై కలెక్టర్ సమీక్ష

- బకాయిలు చెల్లించకపోతే కఠిన చర్యలు

- డిఫాల్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామన్న హెచ్చరిక

పెద్దపల్లి, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్): బకాయిలు చెల్లించని డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పెండింగ్ సిఎంఆర్ బియ్యం బకాయిలపై సంబంధిత రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిసిపి రాం రెడ్డి, అదనపు కలెక్టర్ డి. వేణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనేక సార్లు గడువు ఇచ్చినప్పటికీ సిఎంఆర్ లక్ష్యం మేరకు బియ్యం ఇవ్వని రైస్ మిల్లర్లకు విధించిన జరిమానా రుసుమును శనివారం నాటికి చెల్లించాలని స్పష్టం చేశారు. గడువు లోపు బకాయిలు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన రికార్డుల్లో ఉన్న ధాన్యం మిల్లుల్లో కనిపించడం లేదని కలెక్టర్ తెలిపారు. దీనికి సంబంధించి మిల్లర్ల నుంచి ధాన్యానికి సంబంధించిన బకాయిలను వసూలు చేస్తున్నామని చెప్పారు. బకాయిలు చెల్లించని మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు బ్లాక్ లిస్టులో చేర్చుతామని హెచ్చరించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

డిఫాల్టర్లుగా గుర్తించిన మిల్లర్ల యజమానులు, డైరెక్టర్లు, లీజుదారులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆస్తులపై లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా డిసిపి రాం రెడ్డి మాట్లాడుతూ డిఫాల్టర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందని, అటువంటి పరిస్థితి రాకుండా బకాయిలు వెంటనే చెల్లించాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో గంగయ్య, ఎసిపి రమేష్, పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, రైస్ మిల్లర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-