రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

స్టీల్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు నూతన దిశ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

స్టీల్ ప్లాంట్‌తో ఉత్తరాంధ్రకు నూతన దిశ

- ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి

- భారీ పెట్టుబడులతో పరిశ్రమల విస్తరణ

- లక్షకు పైగా ఉపాధి అవకాశాలు సృష్టి

- లోకేష్ కృషితో మేగా ప్రాజెక్ట్ సాధ్యం

కర్నూలు, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మిట్టల్ – నిప్పాన్ స్టీల్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించనున్న మేగా స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ చూపనుందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర పరిశ్రమల విస్తరణకు కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ ప్రాజెక్టుకు ఇటీవల కేంద్రమంత్రి కుమారస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సమక్షంలో భూమిపూజ జరగడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడం ద్వారా పరిశ్రమల వృద్ధికి మార్గం సుగమమవుతుందని తెలిపారు. మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారులతో నిర్వహించిన చర్చలు, పారదర్శక విధానాల వల్లే ఈ భారీ ప్రాజెక్టు సాధ్యమైందని ఎమ్మెల్యే కొనియాడారు. వేగవంతమైన అనుమతులు, సానుకూల పారిశ్రామిక వాతావరణం పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మించబడుతుందని, ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించనుందని తెలిపారు. స్థానిక యువతకు నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్‌తో పాటు 316 ఎకరాల్లో రూ.11,192 కోట్లతో 50 ఎంటీపీఏ సామర్థ్యంతో క్యాప్టివ్ పోర్ట్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పోర్ట్ ద్వారా మరో 6,000 ఉద్యోగాలు సృష్టించబడతాయని వివరించారు. ఈ ప్రాజెక్టు కేవలం పరిశ్రమ కాకుండా ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తును మార్చే ఉపాధి విప్లవంగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

Comments

-Advertisement-