రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో పనుల పురోగతిపై సమీక్ష

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో పనుల పురోగతిపై సమీక్ష

- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హౌసింగ్ టవర్లపై సమీక్ష

- నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశాలు

- అగ్నిప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తప్పనిసరి

అమరావతి, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్): ప్రజారాజధాని అమరావతిలోని గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న కీలక నిర్మాణ పనులపై అమరావతి గ్రోత్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్‌వీఆర్ శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల హౌసింగ్ టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనుల పురోగతిని ఆయన పరిశీలించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా గుత్తేదారులు, ఇంజినీరింగ్ సిబ్బందితో సమావేశమై పనుల ప్రగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్దేశించిన గడువులో లక్ష్యాలను చేరుకునేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా కచ్చితంగా నిబంధనలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. పనులు సమయానికి పూర్తయితేనే అమరావతి అభివృద్ధి వేగవంతమవుతుందని తెలిపారు. ప్రతి దశలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. ఇటీవల పలు నిర్మాణ స్థలాల్లో అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో భద్రతా చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్‌వీఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. నిర్మాణ ప్రదేశాల్లో తగిన భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాలను నివారించాలని ఆదేశించారు. పనులు నిర్వహిస్తున్న గుత్తేదారులు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ నిర్మాణాలను పూర్తి చేయాలని సూచించారు. అమరావతి నిర్మాణంలో ప్రతి ప్రాజెక్టు కీలకమని, సమయానికి పూర్తి చేయడం ద్వారా ప్రజారాజధాని అభివృద్ధికి తోడ్పడాలని పేర్కొన్నారు.

Comments

-Advertisement-