రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

జగిత్యాల రాజకీయాల్లో కలకలం..

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

జగిత్యాల రాజకీయాల్లో కలకలం..

- కాంగ్రెస్‌లో కొనసాగాలా? వద్దా? త్వరలో నిర్ణయం

- ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు ప్రాధాన్యతపై అసంతృప్తి

- అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ

జగిత్యాల, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):

జగిత్యాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలపై ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు పార్టీలో, ప్రభుత్వ ప్రోటోకాల్‌లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు సాధించకపోవడానికి ఎమ్మెల్యే సంజయ్ కుమారే కారణమని గతంలోనే ఆరోపించిన విషయం తెలిసిందే. పార్టీలో తనకు తగిన గుర్తింపు లభించడం లేదని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “ఇంకెంత కాలం ఈ అవమానాలు భరించాలి?” అంటూ ప్రశ్నించారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని జీవన్ రెడ్డి తెలిపారు. తన అనుచరులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా ముందుగా మీడియాకు తెలియజేస్తానని అన్నారు.

Comments

-Advertisement-