రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మంత్రి పదవిపై వ్యాఖ్యలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మంత్రి పదవిపై వ్యాఖ్యలు

  • ఉద్యమకారులే కాంగ్రెస్ బలం అని రాజగోపాల్ రెడ్డి
  • మంత్రి పదవిపై ఆశలపై స్పష్టీకరణ
  • కేటీఆర్‌తో సాధారణ చర్చలే అన్న ఎమ్మెల్యే
  • సీఎంతో విభేదాల్లేవని క్లారిటీ

హైదరాబాద్, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్): కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలంటే తనలాంటి ఉద్యమకారుల సేవలు అవసరమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి కోసం తాను పరితపించడం లేదని, అయితే గతంలో పార్టీ అధిష్ఠానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని వెల్లడించారు. దీనిపై తుది నిర్ణయం ఏమవుతుందో తనకు తెలియదని చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వం, పార్టీకి మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి పదవి లేకపోయినా ప్రజల్లో తనకు గౌరవం ఉందని, ప్రజా సేవే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పదవులు కంటే ప్రజల విశ్వాసమే ముఖ్యమని అన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈరోజు అసెంబ్లీ లాంజ్‌లో కేటీఆర్‌తో మాట్లాడిన విషయంపై కూడా ఆయన స్పందించారు. ఎలాంటి రాజకీయ చర్చలు కాకుండా సాధారణ విషయాలపైనే మాట్లాడినట్లు తెలిపారు. అయితే 2018లో 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకోవడం తప్పేనని కేటీఆర్‌కు తన అభిప్రాయం చెప్పినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్న ప్రత్యేకంగా భేటీ కాలేదని, అసెంబ్లీలో ఎదురుపడితే సాధారణంగా మాట్లాడుకున్నామని తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలను చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఉద్యమకారుల పాత్ర కీలకమని ఆయన మరోసారి పేర్కొన్నారు. భవిష్యత్తులో పార్టీ మరింత బలపడేలా పనిచేస్తామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే దిశగా కృషి చేస్తామని వెల్లడించారు.

Comments

-Advertisement-