రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్):
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మియాపూర్–బాచుపల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణాల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి సుమారు 10:45 గంటల సమయంలో ఒక దుకాణంలో ప్రారంభమైన మంటలు క్షణాల్లోనే పక్కనున్న షాపులకు వేగంగా వ్యాపించాయి. దుకాణాల్లో కలప, ఫర్నిచర్, ఫోమ్ వంటి తేలికగా మండే పదార్థాలు అధికంగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. కొంతమంది వ్యాపారులు దుకాణాల పక్కనే నివాసం ఉండటంతో అక్కడ నిల్వ ఉంచిన వంట గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలతో పేలాయి. ఆ ప్రాంతంలో మొత్తం సుమారు 25 ఫర్నిచర్ దుకాణాలు ఉండగా, నిమిషాల వ్యవధిలోనే 18 షాపులకు మంటలు వ్యాపించాయి. ఒక్కో దుకాణంలో లక్షల రూపాయల విలువైన కలప సామాగ్రి నిల్వ ఉండటంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆరు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని రాత్రంతా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

-Advertisement-