రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నేర సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్

- ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జ్‌షీట్ వరకు పారదర్శకతకు ఆదేశాలు

- బాధితులకు సకాలంలో న్యాయం అందించాలని స్పష్టం

- పెండింగ్ కేసులపై వేగవంతమైన దర్యాప్తుకు సూచనలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

జగిత్యాల, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్):
జిల్లాలో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తులో పారదర్శకతను పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి చార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి దశలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. బాధితులకు సకాలంలో న్యాయం అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. కేసుల విచారణ వేగంగా, నిష్పక్షపాతంగా జరగాలని ఆదేశించారు. జిల్లాలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసులు, కోర్ట్ మానిటరింగ్, డయల్ 100 కాల్స్, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలను సమీక్షించారు. సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు నగదు రీఫండ్, దొంగతనం కేసుల డిటెక్షన్, హత్యలు, అనుమానాస్పద మృతి కేసుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, మహిళా భద్రతపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ‘అరైవ్–అ లైవ్’ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు లేకుండా దర్యాప్తు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

పాత నేరస్తులు, రౌడీషీటర్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని, తరచుగా తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పోలీసులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సాయి వెంకట్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు, స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు. జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

-Advertisement-