రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కీసరగుట్ట వేద పీఠాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కీసరగుట్ట వేద పీఠాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్

  • వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం
  • వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
  • వేద విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

కీసరగుట్ట, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
హైదరాబాద్ సమీపంలోని కీసరగుట్టలో ఉన్న శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠాన్ని టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాల కార్యకలాపాల గురించి చైర్మన్ వివరాలు తెలుసుకున్నారు. పాఠశాల ఎప్పుడు స్థాపించబడింది, ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులు వేద విద్యను అభ్యసిస్తున్నారు అనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేద విద్య అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చైర్మన్ సూచించారు. ముఖ్యంగా వేద విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. వేద విద్య పరిరక్షణకు టీటీడీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. పాఠశాలలో ఉన్న సౌకర్యాలపై విద్యార్థులు మరియు అధ్యాపకులు సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వేద పాఠశాల ప్రిన్సిపాల్ గూడ శ్రీనివాస శర్మ, అధ్యాపకులు, ఇంజనీరింగ్ అధికారులు, డీఈ రామకృష్ణ, జేఈ చలమా నాయక్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-